గుమ్మడికాయ తురుము - 3 కప్పులు
బెల్లం - ఒక కప్పు
మైదా - 3/4 కప్పులు
యాలకుల పొడి - ఒక టీ స్పూన్
నెయ్యి - తగినంత
తయారు చేసే విధానం :
- ఒక గిన్నెలో మైదా కొద్దిగా నెయ్యి, కొన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిని ఒక గంటపాటు పక్కన పెట్టేయాలి. ఈలోపు బెల్లాన్ని పొడి చేసి పెట్టుకోవాలి.
- ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి గుమ్మడికాయ తురుము వేసి 5నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత పొడి కొట్టిన బెల్లాన్ని వేసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకు సన్నని మంట మీద ఉంచాలి. బెల్లం చిక్కబడినట్లుగా అయ్యేటప్పుడు యాలకులపొడి వేసి మరి కాసేపు కలిపి దించేయాలి. చల్లారాక చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మైదా పిండిని పూరీ సైజుల్లో ఒత్తుకొని గుమ్మడికాయ మిశ్రమాన్ని ఉంచి మళ్లీ చిన్న ఉండలుగా చేయాలి. ఇప్పుడు కొద్ది, కొద్దిగా పిండి వేస్తూ మెల్లగా చపాతీల్లా ఒత్తాలి.
- తర్వాత ఒక పెనం పెట్టి కొద్దిగా నూనె పోసి ఒక్కో భక్షాన్ని రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేవరకు కాల్చుకోవాలి. ఇవి వేడి.. వేడిగా తింటే బాగుంటాయి.