గోధుమ బియ్యం - ఒక గ్లాస్
నీళ్ళు - రెండు గ్లాసులు
పాలు - రెండు గ్లాసులు
పంచదార - ముప్పావు గ్లాస్
యాలకులు - రెండు
జీడిపప్పు - కొంచెం
కిస్ మిస్ లు - కొంచెం
నెయ్యి - రెండు స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
గోధుమ బియ్యాన్ని నీళ్ళలో మెత్తగా ఉడికించాలి. బాగా ఉడికాక పాలు పోసి గరిట జారుగా ఆరనివ్వాలి. అప్పుడు పంచదార వెయ్యాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లు, యాలక్కాయ పొడి వేసి బాగా కలపాలి. ఇది పాయసంలాగా చాల బాగుంటుంది. సాయి బాబాకి నైవేద్యముగా పెడితే చాలా బాగుంటుంది.
మూలం : ఆంద్రభూమి సచిత్ర మాస పత్రిక