ఖుబానీ (ఆప్రికాట్లు) - కేజీ
పంచదార - కేజీ
రూహ్ అఫ్‌జా - 250 గ్రా.
వెనిలా ఎసెన్స్ - ఆరు చుక్కలు
రాస్ప్‌బెర్రీ ఎసెన్స్ - ఆరు చుక్కలు
క్రీమ్ - 50 గ్రా.
తయారి:
- ఆప్రికాట్లను సుమారు అరగంటసేపు నీటిలో నానబెట్టాలి.
- ఒక పెద్ద పాత్రలో నానిన ఆప్రికాట్లను వేసి, తగినంత నీరు జత చేసి ఆప్రికాట్లు మెత్తబడేవరకు ఉడికించాలి.
- నీటిని ఒంపేసి, ఆప్రికాట్లు చల్లారాక గింజలను తీసేయాలి.
- ఒక పెద్ద పాత్రలో పంచదార, ఉడికించిన ఆప్రికాట్లను వేసి రెండూ బాగా కలిసేవరకు ఉడికించాలి.
- బాగా ఉడికిన తర్వాత వెనిలా ఎసెన్స్, రాస్ప్‌బెర్రీ ఎసెన్స్, రూహ్ అఫ్‌జా జత చేసి రెండు నిముషాలు ఉంచాలి.
- క్రీమ్‌తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.