ఖర్జూరాలు, ఎండుకొబ్బరి, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు... మొత్తం కలిపి అరకేజీ ఉండాలి. (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు);
బెల్లం - అరకేజీ;
పటికబెల్లం - మూడు టేబుల్ స్పూన్లు;
ఏలకుల పొడి - అర టీ స్పూను;
నెయ్యి - టేబుల్ స్పూను.
తయారుచేసే పద్ధతి :
- డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు)
- ఖర్జూరాలను బాగా సన్నగా కట్చేయాలి.
- మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి.
- ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటికబెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి.
- బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండపాకం వచ్చేవరకు ఉంచాలి;
- పటికబెల్లం జతచేయాలి;
- ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరోమారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి;
- కిందకు దించి ఉండలు చేయాలి.