క్యారెట్ - పావు కప్పు
సేమియా - అరకప్పు
పాలు - అర లీటర్
చక్కెర - 25 గ్రా.
యాలకులు - 4
జీడిపప్పు - 25 గ్రా.
ఎండు ద్రాక్షలు - 25 గ్రా.
నెయ్యి - 40 గ్రా.
తయారుచేసే పద్ధతి :
- ఒక పాత్రలో పాలు తీసుకొని వాటిలో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు కలుపుకొని, స్టవ్ మీద పెట్టి పది నిముషాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి.మరో వైపు క్యారెట్ తురుముకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి అందులో నెయ్యి వేసి, కరిగాక క్యారెట్ తురుము వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో కొంచెం నెయ్యి వేసి సేమియాను దోరగా వేయించుకోవాలి.
- ఇప్పుడు మరిగించిన పాలను మళ్లీ స్టవ్ మీద పెట్టుకొని అందులో క్యారెట్ తురుమును వేసి ఐదు నిముషాలు మరిగించాలి. తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్షలను వేసి మరో 10 నిముషాలు (పాలు కాస్త చిక్కబడే వరకూ ) సిమ్ లో మరిగించాలి. అంతే క్యారెట్ సేమియా కీర్ రెడీ. దీనిని కాస్త వేడిగా అయిన సర్వ్ చేయవచ్చు లేదా ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయిన సర్వ్ చేయవచ్చు.
మూలం : సాక్షి దినపత్రిక