పెసరపప్పు 2 కప్పులు
పల్లీలు - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
నెయ్యి - 1 కప్పు
పాలు - 1/4 కప్పు
జీడిపప్పు, బాదాం - 1/4 కప్పు
తయారుచేసే విధానం :
పాన్ వేడి చేసి పల్లీలు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. అదే పాన్‌లో అరకప్పు నెయ్యి వేడి చేసి పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పంచదార కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వేయించిన పెసరపప్పు పొడి, పల్లీ పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, సన్నగా తరిగిన లేదా బరకగా పొడి చేసుకున్న జీడిపప్పు, బాదాం, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి.