మైదా, కోవా-రెండు కప్పుల చొప్పున
ఎండుద్రాక్ష-మూడు చెంచాలు
బాదం-రెండొందల గ్రా,
పంచదార-యాభైగ్రా
నూనె-వేయించడానికి తగినంత
తయారుచేసే విధానం
మైదాలో ఆరు చెంచాల నూనె, కాసిని నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి నాననివ్వాలి. బాణలిలో కోవాను ఓసారి వేడిచేసి పంచదార, వేయించిన బాదం, ఎండుద్రాక్ష చేర్చి ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి. మైదాను మరోసారి కలిపి చిన్నపూరీలా వత్తి కోవా మిశ్రమం ఉంచి కజ్జికాయల అచ్చులో ఒత్తాలి. బాణలిలో నూనె వేడిచేసి బంగారు వర్ణం వచ్చాక తీసేస్తే సరిపోతుంది. కోవా కజ్జికాయలు సిద్ధమయినట్టే.