ఓట్స్ - 250 గ్రాములు,
పచ్చికొబ్బరి కోరు - 100 గ్రాములు,
చక్కెర - 1 పెద్దకవ్పు,
నెయ్యి -50గ్రాములు,
జీడిపప్పు,ద్రాక్ష - 25గ్రాములు,
సాఫ్రాన్ కలర్ - చిటికడు,
పాలు - 1 చెంచా.
తయారు చేసే విధానం:
- ఓట్స్ కొద్దిగా నెయ్యి వేసి వేయించి పొడి చేసుకోవాలి, పచ్చికొబ్బరి కోరు రెడీగా పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడి పప్పు - ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో చక్కెర వేసి కొద్దిగా నీరు వేసి పాకం లేతగా రాగానే కొబ్బరి కోరు, ఓట్స్ పొడి వేసి కలపాలి. పాలల్లో కలిసిన సాఫ్రాన్ వేసి కలిపి, నెయ్యి వేయాలి. ఒక్క ఐదునిమిషాల తర్వాత నెయ్యి తేలుతుంది. వేయించిన జీడిపప్పు - ద్రాక్ష వేసి దించుకుంటే ఓట్స్- కొబ్బరి హల్వా రెడీ.
మూలం : సూర్య దినపత్రిక