సోరక్కాయ కోరు - రెండు కప్పులు
బాస్మతి బియ్యం - కప్పున్నర
పాలు - అర లీటర్
చక్కెర - ఒక కప్పు
నెయ్యి - అరకప్పు
చిరంజి పప్పు - పావు కప్పు
జీడిపప్పు - పది
కిస్మిస్ - పది
పచ్చి కొబ్బరి కోరు - రెండు చెంచాలు
రోజ్ వాటర్ - ఒక కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారుచేసే పద్ధతి :
సోరక్కాయ తురుములో నీళ్లు పిండేసి మూకుడులో కొద్దిగా నెయ్యి వేసి కాగాక తురుమును దోరగా వేయించాలి. బాస్మతి బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలా గ్రైండ్ చేసి నెయ్యిలో వేయించాలి. గిన్నెలో పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతుండగా సోరక్కాయ కోరు, బియ్యం రవ్వ, చక్కెర, జీడిపప్పు, చిరంజి పలుకులు వేసి సెగ తగ్గించి కలియపెడుతూ ఉడికించాలి. తర్వాత కిస్మిస్, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి కోరు, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. ఈ పాయసాన్ని వేడిగా తింటేనే రుచిగా ఉంటుంది.
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం