మైదా పిండి - కప్పు
కాగిన నూనె - 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
స్టఫింగ్ కోసం :
కొబ్బరి తురుము - కప్పు
ఖర్జూరం - కప్పు
బాదం - అరకప్పు
తయారుచేసే పద్ధతి :
- మైదా పిండిలో ఉప్పు వేసి కలపాలి. తరువాత కాగిన నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి కాస్త గట్టిగా కలిపి మూతపెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
- కొబ్బరి తురుములో గింజలు లేని ఖర్జురాలను, సన్నగా తరిగిన బాదాం వేసి కలపాలి. తరువాత దీన్ని ఉండలుగా చేసి ఉంచాలి.
- ఇప్పుడు మైదా మిశ్రమాన్ని కూడా ఉండలుగా చేసి చిన్న పూరీలాగా వత్తి అందులోనే కొబ్బరి ఉండను ఉంచి మళ్ళీ పూరీలగా వత్తాలి.
- ఇలాగే అన్ని చేసి నాన్ స్టిక్ పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం