కొబ్బరికోరు -మూడు కప్పులు,
బెల్లం -ఒకటిన్నర కప్పు
వేయించిన శనగపప్పు-అరకప్పు,
నెయ్యి -ఒక టేబుల్ స్పూన్
యాలకులు -4 పొడిచేసుకోవాలి.
తయారుచేసే విధానం :
కొబ్బరికోరుతో బెల్లం, యాలకులు చేర్చి రోటిలోనో, మిక్సీలోనో నీరు చేర్చకుండా పొడిచేయాలి. మందపాటి అడుగు గల పాత్రలో నెయ్యి వేసి పొడిచేసిన కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. తర్వాత స్టౌమీద నుండి దించి వేయించిన శనగపప్పు పొడిని వేసి బాగా కలిపి ఆరబెట్టాలి. తర్వాత నిమ్మకాయంత సైజులలో పిండిని గుండ్రంగా పూర్ణాలు చేసుకోవాలి. పైన చెప్పిన విధంగానే పై పిండిని తయారుచేసి పూరీల్లాగా వత్తుకుని అందులో పూర్ణం పెట్టి మెల్లగా చేత్తో లేకపోతే అరిటాకు మీదనో ఉంచి, తట్టి దోసె పెనంమీద కాల్చాలి. ఇవి వేడివేడిగా తింటే మహారుచిగా ఉంటాయి.
మూలం : వార్త దినపత్రిక