సొరకాయ తురుము - 500 గ్రాములు,
నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు,
యాలకులు - నాలుగు,
పంచదార - రుచికి సరిపడా,
పాలు - సరిపడా,
జీడిపప్పు, కిస్‌మిస్, బాదం పప్పులు - అలంకరణ కోసం.
తయారుచేసే పద్ధతి :
- నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేడిచేసి అందులో నట్స్, కిస్‌మిస్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఒకవేళ వీటిని వేగించడం ఇష్టంలేకపోతే అలానే వాడొచ్చు.
- అదే పాన్‌లో సొరకాయ తురుము వేసి ఏడు నిమిషాల పాటు సన్నటి మంటపై వేగించాలి. ఇందులో పాలు, యాలకులు వేసి మరో పదినిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పంచదార వేసి ఒక నిమిషం పాటు సన్నటి మంట మీద ఉంచాలి. హల్వా పాలను బాగా పీల్చుకుందో లేదో గమనించి స్టవ్ మీద నుంచి దింపేయాలి. పైన నట్స్‌తో అలంకరిస్తే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక