బ్రెడ్ స్లైసులు - 6;
పాలు - ఒకటిన్నర కప్పులు;
పంచదార - ఒక కప్పు;
కిస్‌మిస్ - పావు కప్పు
నెయ్యి - రెండు కప్పులు;
కుంకుమపువ్వు - కొద్దిగా
బాదంపప్పులు - 10;
ఏలకులపొడి - అర టీ స్పూను
వేయించిన జీడిపప్పు - అర కప్పు;
పచ్చికోవా - కప్పు
తయారుచేసే పద్ధతి:
- ఒక పాత్రను స్టౌ మీద ఉంచి, పాలు, ఏలకుల పొడి (సగం), కుంకుమపువ్వు వేసి 20 నిముషాలు ఉడికించాలి.
- స్టౌ మీద పాన్ ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక బ్రెడ్‌ముక్కలను గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- మరొక పాత్రలో పంచదార, నీరు, రెండు ఏలకులు దంచిన పొడి వేసి తీగ పాకం వచ్చాక అందులో పాల మిశ్రమం, బ్రెడ్ ముక్కలు వేసి దగ్గర పడేవరకు ఉడికించాలి.
- పచ్చికోవా, నెయ్యి వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి.
- జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక