మైదాపిండి... 80గ్రాములు
కోడిగుడ్లు... మూడు
బేకింగ్ పౌడర్... పావు చెంచా
వేడినీరు... ఒక
వెనిల్లా ఎసెన్స్... కాసిన్ని చుక్కలు
చక్కెర... 85 గ్రాములు
జామ్... 55 గ్రాములు
తయారుచేసే పద్ధతి
- మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను జల్లెడలో జల్లించుకుని, రెండింటిని కలిపి వేడి నీరు పోసి ముద్దలా చేసుకోవాలి.
- కోడిగుడ్డు సొనను తీసుకుని బాగా కలియ బెట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి నీరు మరుగుతున్న పాత్రలో ఉంచాలి, ఆవిరి వల్ల కోడిగుడ్డు సొన వేడెక్కి, సొనంతా చిక్కగా అయి గట్టి పడినట్లవుతుంది. దీనిని చెంచాతో కలిపి క్రీమ్‌లా చేయాలి.
- ఈ క్రీమ్‌కు మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమా న్ని కూడా జత చేసి, కాస్త ఎసెన్స్ కలపాలి.
- స్వస్‌రోల్ డబ్బా తీసు కుని దాని లోపలి గోడలకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాలి. దాంట్లో పైన కలిపి ఉంచుకున్న పదార్ధం అంతటిని పోయాలి. ఈ డబ్బాను ఓవెన్‌లో ఉంచి 200 సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి. ఒక పేపర్ తీసుకుని పంచదార పోసి, దానిపైన ఓవెన్‌లో ఉడికించిన పదార్థాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పదార్ధం వేడిగా ఉన్నప్పుడే స్పూన్ సాయంతో కేక్ మీద జామ్ రాయాలి. ఈ కేక్‌పై ఐసింగ్ షుగర్, కోకో మొదలైన వాటితో అలంకరించి సర్వ్ చేస్తే సరి..!
మూలం : సూర్య దినపత్రిక