బియ్యంపిండి-అరకప్పు,
నీళ్లు-సరిపడినన్ని
బెల్లం-ఒక కప్పు,
యాలకులపొడి-అరచెంచా
అవసరమనుకుంటే జీడిపప్పులు, బాదంపప్పులు, కిస్‌మిస్‌లు ఒక్కో చెంచా నెయ్యి-గరిటెడు
తయారుచేసే విధానం :
- పిండిని నీళ్లతో చపాతీపిండిలా కలుపుకోవాలి.
- పిండిని చేత్తో సన్నగా సేమియాల్లా చేసుకోవాలి.
- ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు మరిగించి తయారుచేసుకున్న తాలికలు అందులో వేసి ఉడికించాలి.
- తాలికలు ఉడికిన తరువాత పొడిగా చేసి బెల్లం, నెయ్యి వేసి మరికొద్దిసేపు ఉడికించాలి.
- స్టౌమీద నుంచి దించిన తర్వాత యాలకుల పొడివేసి కలిపి, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపప్పులు పైన అలంకరించాలి.