పండు ఖర్జూరాలు - పది
పాలు - అర కప్పు
గోధుమ రవ్వ - అర కప్పు
చక్కెర - పావు కప్పు
టూటీ ఫ్రూటీ - అర కప్పు
సపోటా పండ్లు - నాలుగు
నెయ్యి - పావు కప్పు
తయారు చేసే పద్ధతి:
ఖర్జూరాలను సన్నగా తరిగి కొద్దిగా మంచినీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించి తీసి అందులో చక్కెర కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గోధుమ రవ్వలో ఒక కప్పు నీళ్లు పోసి పది నిమిషాల పాటు నాననివ్వాలి. పాలు మరుగుతుండగా నానబెట్టిన గోధుమ రవ్వవేసి అడుగంటకుండా కొద్దిసేపు కలపాలి. అందులో ఖర్జూరం గుజ్జు, సపోటా పళ్ల గుజ్జు కలిపి చివరగా టూటీ ఫ్రూటీ, నెయ్యి వేసి దించుకుంటే సరి, నోరూరించే ‘ఖర్జూర పాయసం’ రెడీ!
మూలం : నమస్తే తెలంగాణ ఆదివారం పుస్తకం