గోధుమ పిండి - 250 గ్రా.
చక్కెర - 150 గ్రా.
యాలకులు - 5
పచ్చికొబ్బరి - 3 చిన్న ముక్కలు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- చపాతీ అనగానే ఇదేదో నూనెతో చేసే వంట అనుకుంటే పొరపాటే. అయితే దీనిలో మచ్చుకైన నూనె కనిపించదు.
- మొదట గోధుమ పిండిలో తగినంత ఉప్పు, నీళ్ళు చేర్చి పిండిలా కలుపుకొని అర గంట పాటు నానబెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల్లా చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి అందులో నీటిని మరగపెట్టి అందులో ఒక్కొక్కటిగా ఈ చపాతీలను వేయాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత నీటిలో తేలుతాయి. ఆ తర్వాత నీటిలో నుంచి వాటిని వేరుచేసి, ఆరబెట్టిన తర్వాత వాటిపై పచ్చి కొబ్బరి తురుము, చక్కెర, యాలకుల పొడిని చల్లుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
మూలం : సాక్షి దినపత్రిక