కార్న్ ఫ్లేక్స్ (మిక్చర్ కోసం వాడే మొక్కజొన్న ఫ్లేక్స్) : కిలో,
మంచినీళ్లు : తగినన్ని,
రిఫైండ్ ఆయిల్ : తగినంత,
పంచదారపొడి : కేజీ 200 గ్రా.,
ఛాయ పెసరపప్పు : పావు కేజీ,
నెయ్యి : పావుకేజీ,
కోవా : 200గ్రా.,
జీడిపప్పు : 50గ్రా.,
కిస్మిస్ : 25గ్రా.,
యాలకులపొడి : ఒకటిన్నర సూన్,
పచ్చకర్పూరం : పావు స్పూన్.
తయారు చేసే విధానం
- కార్న్‌ఫ్లేక్స్‌ను నూనెలో దోరగా వేయించి చల్లార్చి పక్కన పెట్టి, ఆరిన తరవాత మిక్సీలో మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి.
- పెసరపప్పును నానబెట్టి, నీళ్లు వార్చేసి... ఆపై నూనెలో వేయించి కార్న్ మాదిరిగానే చల్లారిన తరవాత పొడి చేయాలి.
- మందపాటి పాత్రలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. అందులోనే యాలకులపొడి, పచ్చకర్పూరం, కోవా వేసి బాగా కలపాలి.
- తరవాత కార్న్‌ఫ్లేక్స్, పెసరపప్పు పొడులను కూడా వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉండగానే లడ్డూల్లాగా చేయాలి.
- వీటి పైన ఓ కిస్మిస్ను, జీడిపప్పును అద్దితే చూడ్డానికి అందంగా ఉంటాయి. అంతే కార్న్‌ఫ్లేక్స్ లడ్డూలు తయారైనట్లే..!