పాలు - 1 లీటర్
చక్కెర - అరకిలో
నెయ్యి - 100 గ్రా.
బ్రెడ్ - 4 స్లైస్ లు
ఎండు ద్రాక్ష - 50 గ్రా.
బాదం పప్పు - 50 గ్రా.
తయారుచేసే పద్ధతి :
- దోశ పెనముపై కొద్దిగా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పెనంపై ఎండు ద్రాక్ష, బాదం పప్పులను నెయ్యిలో వేయించుకోవాలి.
- తర్వాత స్టవ్ మీద ఒక బాణలి పెట్టి అందులో పాలు, అర గ్లాస్ నీటిని చేర్చి మరిగించుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత అందులో చక్కెర వేసి కలుపుతూ కరిగించుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ లను అందులో వేసి కలుపుతూ ఉండాలి. కరగబెట్టుకున్న నెయ్యిని కూడా అందులో వేసి సుమారు అరగంట పాటు అలాగే తిప్పుతూ ఉంటే బాగా గట్టి పాకంలాగా తయారవుతుంది. చివరగా నెయ్యిలో వేయించుకున్న ఎండు ద్రాక్ష, బాదం పప్పులు, జీడిపప్పులతో డెకరేట్ చేసుకోవాలి. అంతే పాల బ్రెడ్ హల్వా రెడీ.
మూలం : సాక్షి దినపత్రిక