బియ్యం - కప్పు
కొబ్బరి తురుము - ముప్పావు కప్పు
అటుకులు - ముప్పావు కప్పు
బెల్లం తురుము - ఒకటిమ్బావు కప్పు
కొబ్బరి పాలు - ముప్పావు కప్పు
ఉప్పు - చిటికెడు
మిఠాయి రంగు - చిటికెడు
నెయ్యి - సరిపడా
తయారుచేసే పద్ధతి :
- ముందుగా బియ్యం కడిగి రెండు మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్ళు వంపేసి దాంట్లో కొబ్బరి తురుము, అటుకులు కలిపి మెత్తగా రుబ్బాలి.
- తరువాత ఈ మిశ్రమంలో కొబ్బరి పాలు, బెల్లం తురుము, ఉప్పు, మిఠాయి రంగు కలపాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని సుమారు పది గంటలపాటు పులియనివ్వాలి.
- ఇప్పుడు ఈ పిండిని నెయ్యి రాసిన పొంగానాల ప్లేటులో వేసి కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం