బియ్యం-కప్పు,
మినపప్పు-కప్పు
నువ్వులు-ఒకటిన్నర కప్పులు
బెల్లం తురుము-రెండు కప్పులు
యాలకులపొడి-టేబుల్‌స్పూన్
నూనె-వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం :
ముందుగా పూతపిండికోసం మినపప్పు, బియ్యం కడిగి కనీసం ఆరుగంటలు నానబెట్టాలి. తరువాత పిండిని మెత్తగా రుబ్బాలి. నువ్వులు వేయించి తీయాలి. బెల్లం తురమాలి. ఈ రెండూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ నువ్వుల మిశ్రమంలోనే యాలకుల పొడి కూడా వేసి కలిపి ఉండలు చేసుకోవాలి. బాణలిలో నూనెపోసి కాగిన తరువాత నువ్వుల ఉండల్ని పూతపిండిలో ముంచి పూర్ణాలు వేసి ఎర్రగా వేయించి తీయాలి.
మూలం : వార్త దినపత్రిక