పాలు-లీటరు;
తాజా పన్నీరు - కేజీ;
పంచదార - కప్పు;
బాదం, పిస్తా - గుప్పెడు (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి);
యాలకుల పొడి- టేబుల్ స్పూన్;
వెన్న -కొద్దిగా.
తయారుచేసే విధానం:
- ముందుగా అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకొని అందులో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలని చిక్కబడే వరకూ కాయాలి. అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
- పాలు చిక్కబడుతున్నప్పుడే పన్నీరుముక్కల్ని చిదిమి వేయాలి. తర్వాత అందులోనే పంచదార, యాలకుల పొడి వేయాలి.
- ఈ మిశ్రమం దగ్గరపడే వరకూ బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని దగ్గరపడ్డాక ఒక ప్లేట్‌కు వెన్న బాగా రాసి అందులోకి తీసుకోవాలి. పైన బాదం, పిస్తా పలుకులతో అలంకరించుకోవాలి. అంతే టేస్టీ కలాఖండ్ రెడీ!