చిలగడదుంపలు - అర కేజీ
బెల్లం - పావు కేజీ
నెయ్యి - రెండు టీ స్పూన్లు
యాలకుల పొడి - అర టీ స్పూన్
తయారుచేసే పద్ధతి :
చిలగడదుంపలు చెక్కు తీసి శుభ్రంగా కడగాలి. గుండ్రంగా పెద్ద సైజులో ముక్కలు తరగాలి. ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న చిలగడదుంప ముక్కలు, తురిమిన బెల్లం, కొద్దిగా నీరు వేసి సన్నని మంటఫై ఉడికించాలి. దింపే ముందు రెండు టీ స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. వేడి వేడిగా సర్వ్ చేయాలి.
మూలం : సాక్షి దినపత్రిక