బ్రెడ్ - అరకిలో
చక్కెర - 250 గ్రా.
నెయ్యి - 250 గ్రా.
ఎండుద్రాక్ష - 100 గ్రా.
జీడిపప్పు - 100 గ్రా.
తయారుచేసే పద్ధతి :
- ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్షలను వేయించి పెట్టుకోవాలి.
- అదే బాణలిలో ఇంకొంచెం నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తర్వాత అందులోనే చక్కెర వేసి ముద్దగా వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ బ్రెడ్ చక్కెర మిశ్రమంలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షలను వేసి ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. అంతే బ్రెడ్ హల్వా రెడీ. తక్కువ ఖర్చుతో, నిమిషాల్లో పిల్లలకి చేసి ఇవ్వవచ్చు. ఈ బ్రెడ్ జీడిపప్పు హల్వా రుచితో పాటు ఆరోగ్యంవంతమైనది కూడా.
మూలం : సాక్షి దినపత్రిక