తాజా పెరుగు : ఆరు కప్పులు
పంచదార పొడి : నాలుగు కప్పులు
యాలకుల పొడి : అరటీస్పూన్
కుంకుం పూవు : చిటికెడు
కండెన్స్ డ్ మిల్క్ : అర కప్పు
తాజా పండ్ల ముక్కలు : రెండు కప్పులు
తయారుచేసే పద్ధతి :
ముందుగా శుభ్రమైన వస్త్రంలో పెరుగు వేసి ఆరేడు గంటలు హ్యాంగ్ చేస్తే నీరంతా పోతుంది. చిక్కని పెరుగు ఓ గిన్నెలోకి తీసుకొని దారపొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. కండెన్స్ డ్ పాలల్లో కుంకుం పూవు వేసి కలిపి పెరుగు మిశ్రమంలో కలపాలి. సర్వ్ చేసేదాకా ఫ్రిజ్ లో పెట్టాలి.
మూలం : స్వాతి సపరివార పత్రిక