
పాలపొడి - కప్పు;
పంచదార - కప్పు;
నీరు - అర కప్పు;
మైదా - రెండు టేబుల్ స్పూన్లు;
నెయ్యి - కప్పు;
ఉప్పు - చిటికెడు.
తయారుచేసే పద్ధతి :
- ఒక పాత్రలో పంచదార, నీరు పోసి తీగపాకం వచ్చేవరకు స్టౌ మీద ఉంచాలి
- ఒక పాత్రలో పాలపొడి, మైదా, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి, స్టౌ మీద ఉంచి రెండు మూడు నిముషాలు బాగా కలిపి మంట తగ్గించాలి
- మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి జతచేసి, మరో మూడు నిముషాలు ఉంచాలి
- ఈ మిశ్రమం పాత్ర నుంచి విడివడుతుండగా మరో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి, మంట తగ్గించాలి
- ఒక పెద్ద ప్లేట్కి నెయ్యి రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి, బాగా చల్లారాక మనకు ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి.