ఆవుపాలు-రెండున్నర లీటర్లు
పంచదార-కేజీ
బెల్లం-కేజీ
నిమ్మరసం-కప్పు
మైదా-పావుకప్పు
తయారుచేసే విధానం :
పాలను మరిగించి నిమ్మరసం వేస్తే విరిగిపోతాయి. ఆ నీటిని ఒంపేసి ఆ మిశ్రమంపై గట్టి బరువును ఉంచాలి. రెండు, మూడు గంటలయ్యాక పనీర్ తయారవుతుంది. ఇందులో మైదా కలిపి గట్టి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు పంచదార, బెల్లాన్ని సరిపడా నీటిలో తీసుకుని కరిగించాలి. లేతపాకం వచ్చాక ముందుగా చేసి పెట్టుకున్న పనీర్ ఉండల్ని అందులో వేసి ముప్పావు నుంచి గంట వరకు పొయ్యిమీద పెట్టాలి. పాకం చిక్కగా మారాక తీసేస్తే సరిపోతుంది.