కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
జీడిపప్పు - అర కప్పు
పాలు - మూడు కప్పులు
చక్కెర - అర కప్పు
యాలకుల పొడి - ఒక టీ స్పూన్
నెయ్యి - ఒక టీ స్పూన్
తయారు చేసే విధానం :
కొన్ని జీడిపప్పులను తీసి వేయించి పక్కన పెట్టాలి. మిగతా జీడిపప్పును గంటపాటు వేడి నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పప్పులు మెత్తగా అవుతాయి. వీటిని కొబ్బరి ముక్కలతో కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. కొన్ని పాలు పోసి గ్రైండ్ చేస్తే మరింత మెత్తగా అవుతుంది. మిగిలిన పాలను ఒక కడాయిలో పోసి వేడి చేయాలి. కొద్దిగా వేడయ్యాక కొబ్బరి, జీడిపప్పు పేస్ట్‌ని వేసి బాగా కలపాలి. 20నిమిషాల పాటు అలాగే కలుపుతుండాలి. తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి మరికాసేపు అలాగే ఉంచాలి. దీనిపై వేయించిన జీడిపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి. నోరూరించే... కొబ్బరి పాయసం రెడీ!