బియ్యం -గ్లాసు,
పెసరపప్పు -పావు గ్లాసు
నేతిలో వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష పలుకులు-పావుకప్పు
బెల్లం -రెండు కప్పులు,
పాలు -గ్లాసు,
యాలకుల పొడి -అరచెంచా
తయారుచేసే విధానం :
బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి రెండున్నర గ్లాసుల నీళ్లు చేర్చి మెత్తగా ఉడికించుకోవాలి. అందులో బెల్లం తురుము వేసి మరికాసిని నీళ్లు, పాలు చేర్చి మళ్లీ సన్ననిమంటపై పెట్టాలి. బెల్లం లేదా చక్కెర అందులో వేసి కరిగి పొంగలి దగ్గరగా అవుతున్నప్పుడు యాలకులపొడి చల్లుకోవాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులను నేతిలో దోరగా వేయించి అందులో కలపాలి. దించేముందు పైన కొద్దిగా నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది.
మూలం : వార్త దినపత్రిక