
మొక్కజొన్న గింజలు-నాలుగు కప్పులు
పాలు-ఒక లీటరు,
చక్కెర-250గ్రా
నెయ్యి-రెండు టేబుల్ స్పూన్లు
యాలకులపొడి-ఒక టీస్పూన్,
బాదంపప్పు-రెండు టేబుల్‌స్పూన్లు
పిస్తాపప్పులు-ఒక టీస్పూన్,
తయారుచేసే విధానం
పాలల్లో చక్కెర వేసి వేడిచేయాలి. ఈ మిశ్రమం చిక్కబడి సగం అయ్యేవరకు సన్నని సెగమీద మరగనివ్వాలి. బాణలిలో నెయ్యి వేసి మొక్కజొన్న గింజలను కొద్దిసేపు వేయించాలి. వీటికి యాలకులపొడి చేర్చి పాలలో వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమం చిక్కబడిన తరువాత కిందకు దించి బాదం, పిస్తా, గులాబీరేకులతో దానిని అలంకరించాలి. వేడిగా తింటే చాలా బాగుంటుంది.