శనగ పిండి : పావు కిలో
చక్కెర : పావు కిలో
నెయ్యి : ఒక కప్పు
పాలు : 2 చెంచాలు
యాలకులు : 4
జీడిపప్పు, కిస్ మిస్ : కావలసినన్ని
తయారుచేసే విధానం:
శనగ పిండిని పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత దీనిలో నెయ్యి తప్ప మిగిలినవన్నీ వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత నెయ్యి వేడి చేసి, మిశ్రమాన్ని అందులో వేయాలి. చక్కెర కరగడం మొదలయ్యాక మిశ్రమం పాకంలా తయారవుతుంది. ఇందులో జీడిపప్పు, కిస్ మిస్ లను వేసి కలపాలి. దగ్గరగా అయ్యాక తీసి, నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి, చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మూలం : సాక్షి ఆదివారం పుస్తకం