పాలు-ఒక లీటరు,
పంచదార-ఐదారు చెంచాలు,
కుంకుమపువ్వు-కొద్దిగా (అలంకరణకు),
బాస్మతి బియ్యం-100గ్రా.,
నెయ్యి-ఒక చెంచా
తయారీ విధానం :
ఒక మూకుడులో నెయ్యి వేసి బాస్మతి బియ్యాన్ని సువాసన వచ్చేలా వేగించాలి. అది చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి రవ్వగా ఆడుకోవాలి. మందపాటి అడుగున్న గిన్నెగానీ, కుక్కర్‌గానీ పొయ్యి మీద పెట్టి దానిలో పాలు పోసి బియ్యపు రవ్వ కలపాలి. దీనిలో ఒక పొడుగైన గరిట పెడితే పాలు పొంగకుండా ఉంటాయి. సన్నటి మంట పెట్టి ఈ గిన్నె మీద మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వెయిట్ పెట్టాలి. ఒక విజిల్ వచ్చాక మంట తక్కువ చెయ్యాలి. అలా అరగంట ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ కట్టేసి, చల్లారాక ఈ పాయసానికి పంచదార కలపాలి. వేరే గిన్నెలోకి తీసుకుని కుంకుమపువ్వుతో అలంకరించాలి.