సజ్జపిండి - 2 కప్పులు;
బెల్లంతురుము - కప్పు;
నీరు - తగినంత;
ఏలకులపొడి - చిటికెడు;
డ్రైఫ్రూట్స్ - (బాదం, జీడిపప్పు, కిస్మిస్) - 2 టీ స్పూన్లు;
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
- తగినన్ని నీరు మరిగించాలి
- ఒక గిన్నెలో సజ్జపిండి వేసి, వేడినీరు కొద్దికొద్దిగా పోస్తూ కలిపి ముద్ద చేయాలి
- కావలసిన పరిమాణంలో ముద్ద తీసుకొని, కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ, రొట్టె చేసి, పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి
- వేడిగా ఉన్నప్పుడే సజ్జ రొట్టెలకు నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి
- స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, బెల్లం, ఏలకులపొడి, సజ్జరొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి దించాలి
- కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని బాదం, జీడిపప్పులు, కిస్మిస్లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.