బెల్లం తురుము - కప్పు;
శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, వాము, కరక్కాయ - అన్నీ సమపాళ్లలో (కప్పు బెల్లంతో సమానంగా ఉండాలి);
నెయ్యి - కప్పు
తయారుచేసే పద్ధతి :
- శొంఠి, పిప్పళ్లు... ఈ పదార్థాలను బాణలిలో దోరగా వేయించాలి.
- మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.
- ఒక పాత్రలో శొంఠి, పిప్పళ్ల... మిశ్రమం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి.
- నెయ్యి జతచేస్తూ ఉండలు చేసుకోవాలి. (ఇది బాలింతలకు పథ్యంగా పెడతారు. ఈ ఖాయం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం)