పుట్నాల పప్పు - 1 కప్పు
గోంధు లేదా గమ్ము (తినేది) - 1/4 కప్పు
పంచదార - 3/4 కప్పు
యాలకుల పొడి - 1 టీ.స్పూ.
నెయ్యి - 1/4 కప్పు
జీడిపప్పు - 10
లవంగాలు - 5
కిస్మిస్ - 10
తయారుచేసే పద్ధతి :
పుట్నాల పప్పు, పంచదార కలిపి మిక్సీలో మెత్తగా చేసుకుని ఒక గినె్నలో తీసుకోవాలి. పాన్లో నెయ్యి వేడి చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసిన గోంధు వేసి వేయించి పప్పు, పంచదార పొడిలో కలపాలి. ఇవి వేగిన తర్వాత ఉబ్బుతాయి. అదే నెయ్యిలో జీడిపప్పు, లవంగం ముక్కలు, కిస్మిస్ కూడా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి నెయ్యితో సహా పంచదార, పప్పు మిశ్రమంలో వేయాలి. యాలకుల పొడి కూడా కలిపి, నచ్చిన సైజులో ఉండలు కట్టుకోవాలి. ఇవి బాగా ఆరిన తర్వాత డబ్బాలో నిలవ చేసుకోవాలి.