యాపిల్ తురుము - రెండు కప్పులు (నాలుగు యాపిల్స్),
పంచదార - ఒక కప్పు,
నెయ్యి -ఒక టేబుల్ స్పూన్,
బాదం పలుకులు - రెండు టేబుల్ స్పూన్లు,
యాలక్కాయ పొడి - అర టీస్పూన్
తయారుచేసే పద్ధతి :
యాపిల్ తొక్క తీసి తురమాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేడిచేసి యాపిల్ తురుము వేయాలి. అందులోని నీరు ఆవిరి అయిపోయే వరకు వేగిస్తూనే ఉండాలి. దాదాపు పదినిమిషాలు పడుతుంది. తరువాత పంచదార వేసి అప్పుడప్పుడు కలుపుతూ మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించి బాదం పలుకులు వేసి కలపాలి. పొడిపొడిగా అవ్వగానే యాలకులపొడి వేయాలి. వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి అందులో యాపిల్ హల్వాను వేసి సమంగా పరవాలి. ఆ తరువాత చాకుతో మీకు నచ్చిన ఆకారంలో కోసుకుని అవి చల్లారాక తినాలి.