సేమ్యా-100గ్రా,
జీడిపప్పు-రెండు టేబుల్‌స్పూన్లు
ఎండుద్రాక్ష-ఒక టేబుల్‌స్పూన్,
పంచదార-కప్పు
నెయ్యి-నాలుగు టేబుల్‌స్పూన్లు,
కుంకుమపువు్వ-12రేకలు
నీళ్లు-ముప్పావు లీటరు
తయారుచేసే విధానం :
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేయాలి. జీడిపప్పు ఎండుద్రాక్ష వేయించి తీయాలి. అదే నెయ్యిలోనే తరువాత సేమ్యాను కూడా వేయించి తీయాలి. సేమ్యా పక్కకు తీసి అదే బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. తరువాత సేమ్యా వేసి ఉడికించాలి. రంగు బాగా ఉండాలనుకుంటే కొద్దిగా మిఠాయిరంగు కలిపితే బాగుంటుంది. బాగా ఉడికిన తరువాత పంచదార వేసి తిప్పాలి. తరువాత మిగిలిన నెయ్యి వేసి పదినిముషాలు సిమ్‌లో ఉంచి దించాలి. చివరిగా వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వడ్డిస్తే రుచికరమైన సేమ్యా కేసరి రెడీ!
మూలం : వార్త దినపత్రిక