బియ్యం -కిలో (కడిగి నానబెట్టాలి),
ఎసరు నీరు -రెండు ముప్పావు లీటర్లు
తాజాగట్టి పెరుగు-లీటరు,
చిక్కటిపాలు (కాచినవి)-అరలీటరు
నెయ్యి -100గ్రా,
పచ్చిమిర్చి -10,
అల్లం (సన్నని ముక్కలు)-రెండు స్పూన్లు
ఆవాలు -రెండు టేబుల్‌స్పూన్లు
ఇంగువపొడి -అర టీ స్పూన్
మిరియాలు -నాలుగు టేబుల్ స్పూన్లు
పసుపు -పావు టీస్పూన్,
ఉప్పు -తగినంత
తయారుచేసే విధానం :
బియ్యం కడిగి ఎసట్లో వేసి కాస్త మెత్తగా ఉడికించాలి. అన్నం చల్లార నివ్వాలి. పెరుగులో నీళ్లు పోయకుండ గిలకొట్టి పసుపు, ఉప్పు, అల్లం,. పచ్చిమిర్చి తురుము వేసి కలపాలి. నేతిలో ఎండుమిర్చి, ఆవాలు, మిరియాలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి సువాసన వచ్చే వరకూ వేసి పెరుగులో కలపాలి. ఇప్పుడు గోరువెచ్చని పాలు పోసి, అన్నం కూడా వేసి బాగా కలిపి గిన్నెలోకి సర్దాలి. (పెరుగు మాత్రమే వేసినట్లయితే దద్దోజనం త్వరగా పులిసిపోతుంది. కాచిన పాలు కలపడం వల్ల రుచి పెరుగుతుంది. చిక్కగా ఉంటుంది).
మూలం : వార్త దినపత్రిక