మామిడి పండ్లు - రెండు
పంచదార పొడి - 150 గ్రా.
యాలకుల పొడి - పావుటీస్పూన్
నెయ్యి - అరకప్పు
శనగ పిండి - 300 గ్రా.
జీడిపప్పు + ఎండు ద్రాక్ష - పావు కప్పు
తయారుచేసే పద్ధతి :
- మామిడి పండ్ల రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక, శనగ పిండిని వేసి దోరగా వేయించుకోవాలి.
- వెడల్పాటి పళ్ళెంలో వేయించిన శనగ పిండి, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి, ముందుగా తీసి పెట్టుకున్న మామిడి రసాన్ని చేర్చి బాగా కలుపుకోవాలి.
- చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ, ఈ మిశ్రమాన్ని లడ్డుల్లాగా చేసుకోవాలి.
- వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్షలను అక్కడక్కడ అలంకరిస్తే చాలు. ఎంతో రుచికరమైన లడ్డు తయారైనట్లే..
మూలం : సాక్షి దినపత్రిక