అటుకులు : 2 కప్పులు,
పచ్చికొబ్బరి తురుము : కప్పు,
యాలకులు : స్పూన్,
బెల్లం : 2 కప్పులు,
కిస్‌మిస్ : 2 స్పూన్లు,
పాలు : 1/2 కప్పు,
జీడిపప్పు : స్పూన్,
నెయ్యి : వేయించడానికి సరిపడ.
తయారు చేసే విధానం
ముందుగా అటుకులను శుభ్రంగా ఏరి వాటిని మిక్సీలో వేసి కాస్త గరుకుగా పట్టుకోవాలి. తర్వాత కొబ్బరిని, బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు, కిస్ మిస్‌లను దోరగా వేయించాలి. తర్వాత పాలను గిన్నెలో పోసి వేడిచేసి అందులో తురిమిపెట్టుకున్న బెల్లాన్ని వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచి తర్వాత పాలను, కొబ్బరి తురుమును అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలిపి వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూలు చుట్టాలి. చివరగా వీటిపై మెల్లగా జీడిపప్పు, కిస్ మిస్‌లను అద్దాలి.