
మైదా పిండి - కప్పు
వేరుసెనగ పప్పు - కప్పు
నువ్వులు - 3 టీస్పూన్లు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
యాలకులు - 2
నెయ్యి - సరిపడా
తయారుచేసే పద్ధతి :
- పాన్ లో వేరు సెనగ పప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులో నువ్వులు కూడా వేయించి తీయాలి. ఇప్పుడు వేరుసెనగ పప్పులు, నువ్వులు, యాలకులు కలిపి మిక్సీలో వేసి పొడి చేయాలి.
- తరువాత ఈ మిశ్రమంలో బెల్లం పొడి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
- మైదాలో నెయ్యి వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా వత్తాలి.
- అందులో సుమారు టేబుల్ స్పూన్ పల్లీల మిశ్రమం వేసి అంచులు మూసేసి మళ్లీ నెయ్యి అద్దుతూ పూరీలా చేయాలి.
- ఇలాగే అన్నీ చేసి పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం