చిలగడ దుంపలు - అరకిలో
చక్కెర - అరకప్పు
పాలు - అర లీటర్
యాలకుల పొడి - అర చెంచ
కేసరి రంగు - చిటికెడు
జీడిపప్పు, కిస్ మిస్ - కొన్ని
తయారుచేసే పద్ధతి :
- ముందుగా చిలగడ దుంపల్ని ఉడికించుకోవాలి. వాటి వేడి తగ్గాక పై పొట్టు తీసి మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కాచి చల్లార్చిన పాలు పోసి కలపాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటి వేసి బాగా కలపాలి. ఈ పాయసాన్ని ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తీసుకుంటే బాగుంటుంది.
మూలం : సాక్షి దినపత్రిక