పన్నీర్ తురుము - పెద్ద కప్పు
పాల పొడి - అరకప్పు
చక్కెర పొడి - రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - చెంచ
ఆరెంజ్ పొడి - అరకప్పు
తయారుచేసే పద్ధతి :
- నాన్ స్టిక్ పాన్ ని సన్నని మంటపై వేడిచేసి పన్నీర్ తురుము, చక్కెర పొడి వేసి వేయించాలి. రెండు లేక మూడు నిమిషాలయ్యాక పాలపొడి కలపాలి. అది కూడా కొద్దిగా వేగాక యాలకుల పొడి వేసి దించేయాలి. ఈ క్రమంలో మరీ వేగి రంగు మారకుండా చూసుకోవాలి.
- వేడి కొద్దిగా తగ్గాక ఉండల్లా చేసుకొని ఆరెంజ్ పౌడర్ లో ముంచి తీయాలి. వీటిని పది లేక పదిహేను నిముషాలు ఫ్రిజ్ లో ఉంచితే పొడి పన్నీర్ ఉండలకు పడుతుంది.
మూలం : ఈనాడు వసుంధర