పన్నీర్ తురుము - 2 కప్పులు
కోవా - అర కప్పు
బాదం,పిస్తా,జీడిపప్పు, కిస్మిస్ - అరకప్పు
యాలకుల పొడి - అరటీస్పూన్
పాకం కోసం :
పంచదార - 4 కప్పులు
మంచి నీళ్ళు - 4 కప్పులు
కుంకుమ పువ్వు - కొద్దిగా
యాలకులపొడి - అరటీస్పూన్
తయారుచేసే పద్ధతి :
- నట్స్ అన్నింటినీ చిన్న ముక్కలుగా చేయాలి. కోవాలో నట్స్ ముక్కలు, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచుకోవాలి.
- పన్నీర్ ను మెత్తగా చేసి కావలసిన ఆకారంలో అంటే గుండ్రంగా లేదా కోలాకారంలో గానీ చేయాలి. ఒక్కో ఉండ మధ్యలో గుంతలా చేసి నట్స్ మిశ్రమాన్ని అరటీస్పూన్ చొప్పున వేసి మూసేయాలి.
- మందపాటి గిన్నెలో పంచదార, మంచి నీళ్ళు పోసి మరిగించాలి. సుమారు పావు గంట సేపు మరిగిన తరువాత పన్నీర్ ఉండల్ని పాకంలో వేయాలి. ఇప్పుడు మూతపెట్టి సిమ్ లో మరో పదిహేను నిముషాలు ఉడికించి దించాలి. ఆరిన తర్వాత వడ్డించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం