గోధుమలు-రెండు కప్పులు
జీడిపప్పు, బాదం-ఒక కప్పు
పంచదార-మూడు కప్పులు
నెయ్యి-30మి.లీ
యాలకులపొడి-అర టేబుల్‌స్పూన్
కుంకుమపువ్వు-కొద్దిగా
తయారుచేసే విధానం
గోధుమలు, బాదంపప్పులు రాత్రి నానబెట్టండి. ఉదయం గోధుమల్లో కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. దాంట్లో నీళ్లుపోసి పాలు తీయండి. వాటిని పక్కకు పెట్టండి. పైన తేరుకున్న నీళ్లను వంపేయండి. బాదంపప్పులపై తొక్క తీసివేసి మెత్తగా గ్రైండ్ చేయండి. దాన్ని గోధుమపాలలో కలపండి. జీడిపప్పులను కొంచెం నేతిలో వేయించి పక్కకు పెట్టండి. బాణలిలో పంచదారను వేసి, ఒక కప్పు నీళ్లు పోసి కరిగించండి. ఆ తర్వాత గోధుమ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండండి. కుంకుమ పువ్వు కూడా వేసి హల్వా గట్టిపడేవరకు ఉడికించాలి. యాలకులపొడివేసి కలపండి. కొంచెం నెయ్యి వేయండి. ప్లేటుకు నెయ్యి రాసి హల్వా మిశ్రమాన్ని ప్లేటులో వేయండి. చల్లారిన తర్వాత కావలసిన షేపులో ముక్కలు కోసి పైన జీడిపప్పులు అలంకరించండి.