బియ్యంపిండి-ఒక కప్పు,
నీళ్లు-ఒక కప్పు
నెయ్యి-రెండు గరిటెలు,
వంటసోడా-చిటికెడు
ఉప్పు-చిటికెడు
ఉండ్రాళ్లలో నింపడానికి
పచ్చికొబ్బరికోరు-ఒక కప్పు,
కొబ్బరిపొడి-అరకప్పు
వేయించిన గసాలు-ఒక గరిటెడు,
యాలకుల పొడి-అరచెంచా
తయారుచేసే విధానం
కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్లో వేడిచేయాలి. ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని వేడి చేయాలి. ఉప్పు, నెయ్యి వేసి మరిగిన తరువాత బియ్యంపిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. తక్కువ మంటపైన పిండిని ఉడికించి తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి చిన్న ఉండను తీసుకుని చిన్న బౌల్లాగా తయారుచేసి అందులో కొబ్బరి పాకాన్ని కొద్దిగా ఉంచి మూసివేసి గుండ్రంగా ఉండ్రాళ్లలా చుట్టాలి. లేదా మీ కిష్టమైన ఆకృతుల్లో వీటిని చేసి తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతిలో తింటే చాలా రుచిగా ఉంటాయి.