వరిపిండి - 15(గా.
బటర్ - 5(గా.
కోడిగుడ్లు - 4
తేనె - 2 స్పూన్స్
బేకింగ్ పౌడర్ - ఒక స్పూన్
కుంకుమ పువ్వు - ఒక టీ స్పూన్
ఉప్పు - కొద్దిగా,
క్రీమ్ - 25(గా.
మపిల్ సిరప్ - ఒక స్పూన్
నిమ్మరసం - ఒక టీ స్పూన్
స్ట్రాబెరీస్ - 50(గా.
పిస్తా - 2(గా.
తయారుచేసే విధానం :
- ఓవెన్‌ని 180 డిగ్రీల సెంటీ(గేడ్ వద్ద వేడి చేయాలి.
- ఒక గిన్నెలో వరిపిండి, బటర్, రెండు కోడిగుడ్లు, తేనె, బేకింగ్ పౌడర్, కుంకుమ పువ్వు, ఉప్పు అన్ని బాగా మిక్స్ చేయాలి.
- ఈ పిండిని కేక్‌పాన్‌లో వేయాలి. వేసేముందు పాన్‌కి కొద్దిగా బటర్ రాయాలి.
- 15 నుంచి 20నిమిషాల పాటు ఓవెన్‌లో బేక్ చేయాలి. బయటకు తీసి కాసేపు చల్లారనివ్వాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డులోని తెల్లసొన, క్రీమ్, నిమ్మరసం అన్ని వేసి బాగా కలపాలి. దీంట్లోనే మపిల్ సిరప్‌ని కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పోయాలి.
- పై నుంచి స్ట్రాబెరీలను చిన్న ముక్కలుగా కట్‌చేసి డెకరేట్ చేయాలి. పై నుంచి పిస్తాతో గార్నిష్ చేయాలి. అంతే.. తియ్యటి స్ట్రాబెరీ కేక్ మీ ముందుంటుంది.