బొంబాయి రవ్వ - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
ఎండు కొబ్బరి పొడి - అర కప్పు
పాలు - పావు కప్పు
యాలకులు - 4
నెయ్యి - 3 స్పూన్స్
జీడిపప్పు - 10
కిస్‌మిస్ - 10
తయారు చేసే విధానం :
- చక్కెర, యాలకులను మిక్సీ పట్టాలి. మెత్తటి పొడి అయ్యేవరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించాలి. బంగారు వర్ణం వచ్చాక కడాయిలో నుంచి తీసి ఓ ప్లేటులో వేసుకోవాలి.
- అదే కడాయిలో మళ్లీ కొంచెం నెయ్యి వేసి సన్నని మంట మీద రవ్వను వేయించుకోవాలి. రవ్వ రంగు మారిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, పొడి చేసుకున్న చక్కెర, వేయించుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి కలపాలి. చివరగా పాలు పోసి మరికొద్దిసేపు కలపాలి.
- ఇప్పుడు స్టౌ మీద నుంచి దించి చేతికి నెయ్యి రాసుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా చేసుకోవాలి. చల్లగా అయితే లడ్డులు చేయడానికి రావు.