
సగ్గుబియ్యం-ఒక కప్పు,
నెయ్యి లేక డాల్డా- ఒక కప్పు
బెల్లంపొడి-ఒక కప్పు,
జీడిపప్పు-5
యాలకులు-4,
కిస్మిస్-5
తయారుచేసే విధానం :
- పదిగంటల పాటు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. నానిన తరువాత నీళ్లు ఒంపేసి సగ్గుబియ్యం మెత్తగా రుబ్బుకోవాలి.
- ఒక మందపాటి గిన్నెలో రుబ్బిన సగ్గుబియ్యం పిండిని, బెల్లం పిండిని వేసి బాగా కలిపి సన్నని సెగమీద మాడకుండా, అడుగంట కుండా కలుపుతూ ఉడకనివ్వాలి.
- దగ్గరగా ఉడికిన తరువాత నెయ్యి వేసి కలిపి యాలకుల పౌడర్ వేసి, నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కూడా వేసి కలపాలి.
- ఒక పళ్లానికి నెయ్యి రాసి గట్టిగా అయిన తరువాత హల్వాను పళ్లెంలో పోసి, చల్లారిన తరువాత కట్ చేసుకోవాలి.