పాలు - రెండు కప్పులు
పన్నీర్ తురుము - అర కప్పు
జీడిపప్పు - అరకప్పు
చక్కెర - అరకప్పు
యాలకుల పొడి - చెంచ
నెయ్యి - చెంచ
అలంకరణకు జీడిపప్పు, బాదం పలుకులు - పావుకప్పు
తయారుచేసే పద్ధతి :
- ముందుగా జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
- మిగిలిన అరకప్పు జీడిపప్పును ఇరవై నిముషాలు నీటిలో నానబెట్టుకొని పేస్ట్ లా చేసుకోవాలి.
- మరో గిన్నెలో పాలను తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. అవి మరిగాక చక్కెర వేయాలి. అది కరిగిందని నిర్ధారించుకున్నాక జీడిపప్పు మిశ్రమాన్ని వేయాలి. కొన్ని క్షణాలాగి పన్నీర్ తురుము వేయాలి. అది ఉడికాక యాలకుల పొడి వేయాలి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకుల్ని సగం వేసి, పొయ్యి కట్టేసి మిగిలిన వాటిని పైన అలంకరిచుకుంటే పాయసం చాలా రుచిగా ఉంటుంది.
మూలం : ఈనాడు వసుంధర